శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రం
కళ్యాణం నో విధత్తాం కటకతటలసత్కల్పవాటీనికుంజ- -క్రీడాసంసక్తవిద్యాధరనికరవధూగీతరుద్రాపదానః । తారైర్హేరంబనాదైస్తరళితనినదత్తారకారాతికేకీ కైలాసః శర్వనిర్వృత్యభిజనకపదః సర్వదా పర్వతేంద్రః ॥ 1 ॥ యస్య ప్రాహుః స్వరూపం సకలదివిషదాం సారసర్వస్వయోగం యస్యేషుః శార్‍ంగధన్వా సమజని జగతాం రక్షణే జాగరూకః । మౌర్వీ దర్వీకరాణామపి చ పరిబృఢః పూస్త్రయీ సా చ లక్ష్యం సోఽవ్యాదవ్యాజమస్మానశివభిదనిశం నాకినాం శ్రీపినాకః ॥ 2 ॥ ఆతంకావేగహారీ సకలదివిషదామంఘ్రిపద్మాశ్రయాణాం మాతంగాద్యుగ్రదైత్యప్రకరతనుగలద్రక్తధారాక్తధారః । క్రూరః సూరాయుతానామపి చ పరిభవం స్వీయభాసా వితన్వ- -న్ఘోరాకారః కుఠారో దృఢతరదురితాఖ్యాటవీం పాటయేన్నః ॥ […]